లోతట్టు ప్రాంతాల పరిశీలన
భీమవరం (ప్రకాశంచౌక్): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. రోడ్ల మార్జిన్, లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగిపోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అల్పపీడనం దృష్ట్యా రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని దీని దృష్టిలో ఉంచుకొని ఎక్కడ పారిశుద్ధ్య లోపం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణలను గుర్తించడంతోపాటు, రోడ్ల మార్జిన్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన భవన యజమానులకు నోటీసులు జారీచేసి, తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సోమేశ్వర స్వామి దేవస్థానం ముందు పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు. కార్తీక మాసంలో దేవాలయ ప్రాంగణాలు అత్యంత పరిశుభ్రతగా ఉండేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైల్వే అండర్ పాస్ కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ కాలేజీ బాయ్స్ వసతి గృహాన్ని కలెక్టర్ సందర్శించి, విద్యార్థులను మౌలిక వసతులపై ఆరా తీశారు.


