
ఆక్వా సాగులో మెలకువలతో లాభాలు
కాళ్ల: ఆక్వా సాగులోని మెలకువులతో రైతులు లాభసాటిగా ముందుకు సాగాలని కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పెదఅమిరంలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో మూడురోజులపాటు నిర్వహించే ఆక్వా ఎక్స్ ఇండియాను గురువారం వారు ప్రారంభించారు. ఆక్వా ఎక్స్‌పోలను రొయ్య, చేపల రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిర్వాహకులు దంతులూరి వేణు మాట్లాడుతూ 9 ఏళ్లుగా అనేక చోట్ల ఆక్వా ఎక్స్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్వా ఎక్స్‌పో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 100 స్టాల్స్‌తో ప్రదర్శన జరుగుతుందన్నారు. మొదటి రోజు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది రైతులు పాల్గొని వివిధ ఆక్వా కంపెనీలు ఏర్పాటు చేసిన 80 స్టాల్స్ ను సందర్శించి వాళ్లకి కావాల్సిన సమాచారం, ప్రొడెక్షన్ గురించి తెలుసుకున్నారన్నా రు. అలాగే మిగిలిన రెండు రోజులలో జరిగే కార్యక్రమానికి దాదాపు 6000 మంది పైగా వివిధ కంపెనీ ల ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలోఆక్వా ఎక్స్‌పో టైటిల్ పార్టనర్ నెక్సజెన్ కంపెనీ నుంచి అక్కిన శేషు, సీఓఓ టి. శ్రీనివాస్, సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత యిర్రింకి సూర్యారావు, పొత్తూరి బాపిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.