
బండివారిగూడెం వద్ద లారీ బోల్తా
టి.నరసాపురం: మండలంలోని బండివారిగూడెం సమీపంలో జామాయిల్ పుల్ల లోడు లారీ బోల్తాపడింది. వివరాల ప్రకారం చింతలపూడి మండలం యర్రగుంటపల్లికి చెందిన లారీ జామాయిల్ పుల్లల లోడుతో చింతలపూడి నుంచి రాజమండ్రి పేపర్ మిల్లుకు వెళుతోంది. బండివారిగూడెం సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలో పడి అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్‌లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
తణుకు అర్బన్: రాష్ట్ర స్థాయిలో నిర్వహించనున్న అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా బాలురు, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డి అసోసియేషన్ సెక్రటరీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద తాడేపల్లిలోని శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు ఎంపికలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 2006 జనవరి 1వ తేదీ తరువాత జన్మించిన వారై ఉండాలని, 75 కేజీలు లోపు బాలురు, 65 కేజీలు లోపు బాలికలు బరువు కలిగి ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడ గొల్లపూడిలో నిర్వహించే అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీలో పాల్గొంటారని వివరించారు. ఇతర వివరాలకు 94913 33906, 96424 96117 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు.