
ఉపాధ్యాయుల పోరుబాట
భీమవరం: తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. జిల్లాలోని ఉపాధ్యాయులంతా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను తక్షణం విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ ప్రకటించాలని, అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, యాప్‌లు, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానాలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించినట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి.ప్రకాశం తెలిపారు. ఈనెల 12న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 13, 14 తేదీల్లో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించడం, 15న తాలూకా కేంద్రాల్లో, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, 17న ముఖ్యమంత్రి, సీఎస్‌లకు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా వినతులు పంపించి నిరసనలు తెలుపుతామని, అప్పటికీ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు.