
15న కృష్ణాష్టమి వేడుకలు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈనెల 15 న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్ మూర్తి తెలిపారు. అందులో భాగంగా ఆరోజు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే 16న సాయంత్రం క్షేత్రంలో ఉట్ల పండుగ, శ్రీవారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. భక్తులు గమనించాలని ఆయన కోరారు.
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్‌ఎంఆర్ కార్మికులకు 2025 –26 సంవత్సరానికి వేతనాల పెంపును ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఒక రోజుకి స్కిల్డ్ కార్మికునికి రూ.710 నుంచి రూ.730, సెమీ స్కిల్డ్ కార్మికునికి రూ.640 నుంచి రూ.665, అన్‌స్కిల్డ్ కార్మికునికి రూ.595 నుంచి రూ.615గా నిర్ణయించారని, ఈ వేతనాలు ఏప్రిల్ 01, 2025 నుంచి అమలులోకి వస్తాయన్నారు.