అన్నదాత పోరు | - | Sakshi
Sakshi News home page

అన్నదాత పోరు

Sep 10 2025 10:10 AM | Updated on Sep 10 2025 10:10 AM

అన్నద

అన్నదాత పోరు

సీసలిలో 144 సెక్షన్‌ అన్నదాత పోరు అధినేతతో భేటీ వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టిబాబు ఉపాధి హామీవేతనాలు చెల్లించాలి వెలుగు వీవోఏల సమస్యలు పరిష్కరించాలి 12న స్థాయీ సంఘ సమావేశాలు స్మార్ట్‌ మీటర్లు వద్దు మల్టీపర్పస్‌ గోడౌన్లు వినియోగంలోకి తేవాలి

రోడ్డెక్కిన రైతులు

చంద్రబాబు పాలన మొత్తం వంచనే

ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

యూరియాకు తీవ్ర కొరత

యూరియా కోసం క్యూలైన్‌ కష్టాలు

న్యూస్‌రీల్‌

కూటమి పాపాలు పండుతున్నాయి

ప్రభుత్వ మెడలు వంచుతాం

సీసలిలో 144 సెక్షన్‌
సీసలిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా మంగళవారం నుంచి 15 రోజులపాటు గ్రామంలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 8లో u
ఆంక్షలు అధిగమించి..
సాగును నిర్వీర్యం చేస్తూ కూటమి దగాకోరు పాలనపై కర్షకులు కదం తొక్కారు. అన్నదాత పోరు విఫలయత్నానికి ఆంక్షల రూపంలో ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా విజయవంతం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెంలోని ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.

బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

తణుకు అర్బన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం మాజీ మంత్రి, రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కారుమూరి సునీల్‌కుమార్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కలిసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ పరిపాలనపై చర్చించినట్లు కారుమూరి తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌: వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా యలమంచిలి మండలానికి చెందిన మామిడిశెట్టి చిట్టిబాబును నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

భీమవరం: జిల్లాలో ఉపాధి హామీ వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పనిచేసిన 15 రోజుల్లో వేతనాలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా మూడు నెలలుగా ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికై నా ఉపాధి కూలీల ఇబ్బందులను గుర్తించి వేతనాలు వెంటనే వేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని జిల్లా డ్వామా పీడీ కెసీహెచ్‌ అప్పారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బల్ల చిన వీరభద్రరావు, శేషపు అశ్రియ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు జక్కంశెట్టి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: వెలుగు వీవోఏల సమస్యలను తక్షణం పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పీడీ ఆఫీసులు ముట్టడిస్తామని వెలుగు వీవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భీమవరం మార్కెట్‌యార్డ్‌లో మంగళవారం వెలుగు వీవోఎల జిల్లా మహాసభ నాగిడి గోవిందమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయిస్తుందని, యాప్‌ల ద్వారా పని భారం పెంచుతుంది కానీ సెల్‌ఫోన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. సెల్‌ఫోన్స్‌ ఇస్తామని హామీ ఇచ్చి ఏడాది గడిచినా నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. జూమ్‌ మీటింగ్‌ పేరుతో వీవోఏలను రాత్రి, పగలు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకపక్క విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే మరోపక్క జీతాలు పెరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయు ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రాయ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 12 ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరుగుతుందని జెడ్పీ సీఈఓ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, భీమవరం/నరసాపురం/తాడేపల్లిగూడెం: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని, రైతులందరికీ పూర్తిస్థాయిలో అన్నదాత సుఖీభవ పథకం వర్తింపచేయాలని తదితర డిమాండ్లతో రైతుల పక్షాన మంగళవారం వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో అన్నదాత పోరు జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునందుకుని పార్టీ శ్రేణులు, రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సర్కారు విఫల యత్నం

అన్నదాత పోరును అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. సెక్షన్‌ 30 అమల్లో ఉందని, ర్యాలీలకు అనుమతిలేదంటూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ల నివాసాలు, పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులను మోహరించి చెదరగొట్టే ప్రయత్నాలు చేసినా పార్టీ శ్రేణులు, రైతులు లెక్కచేయలేదు. నియోజకవర్గాల నుంచి ఆర్డీఓ కార్యాలయాలకు చేరుకుని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద వినతిపత్రాలు అందజేసేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించారు.

నరసాపురంలో..

నరసాపురంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాలకొల్లు కో–ఆర్డినేటర్‌ గుడాల శ్రీహరిగోపాలరావు, పార్టీ శ్రేణులు, రైతులు ర్యాలీగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లారు. అడుగడుగునా పోలీసులు మోహరించి అడ్డంకులు కల్పించినా లెక్కచేయకుండా నిరసన ప్రదర్శన కొనసాగించారు. రైతులను ఆదుకోవాలని, కూటమి సర్కారు కళ్లు తెరవాలంటూ దారిపొడవునా నినాదాలు చేశారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద పోలీసులు గేటు మూసివేసి కొంత మందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ గేటు వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందజేశారు.

తాడేపల్లిగూడెంలో..

మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అబ్జర్వర్‌ ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీ కార్యాలయం వద్ద నుంచి భారీ ర్యాలీగా, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పెద్ద ఎత్తున తణుకు నియోజకవర్గ శ్రేణులతో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసులు పార్టీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి, అబ్జర్వర్‌ మురళీకృష్ణంరాజులు రైతు సమస్యలను ఆర్డీఓ ఖతీఫ్‌ కౌసర్‌ బానోకు వివరించి వినతిపత్రం అందజేశారు.

భీమవరంలో..

రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వడ్డి రఘురాం, భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చినమిల్లి వెంకటరాయుడు, ఉండి నియోజకవర్గ కో–ఆర్డినేటర్‌ పీవీఎల్‌ నరసింహరాజు, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, పార్టీ శ్రేణులు, రైతులు ప్రదర్శనగా భీమవరం మునిసిపల్‌ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ యూరియా కోసం అవస్థలు పడుతున్న రైతులను ఆదుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడితే పోలీసులతో అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. భీమవరం కో–ఆర్డినేటర్‌ వెంకటరాయుడు మాట్లాడుతూ యూరియా కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉండి కో–ఆర్డినేటర్‌ పీవీఎల్‌ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. మహిళ నేత ఉమాబాల మాట్లాడుతూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కష్టాలు గుర్తించి వారి పక్షాన వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ పోరాటం సాగిస్తుందన్నారు.

తాడేపల్లిగూడెం: ఆర్డీఓ కార్యాలయంలోకి వెళుతున్న మాజీ మంత్రులు కొట్టు, కారుమూరి

నరసాపురం: ఆర్డీఓ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు

భీమవరం: ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న పార్టీ నాయకులు చినమిల్లి, పీవీఎల్‌, కవురు, రఘురామ్‌, ఉమాబాల

ఏలూరు (టూటౌన్‌): విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించవద్దని.. పెంచిన విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఏలూరులో కొత్త బస్టాండ్‌ సమీపంలోని వంతెన వద్ద మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదానీ మీటర్లు వద్దు.. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.శ్రీనివాస్‌, ఆర్‌.లింగరాజు, డీఎన్‌వీడీ ప్రసాద్‌ మాట్లాడారు. గత ఎన్నికల ముందు విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగలగొట్టండని లోకేష్‌ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రజలపై భారంపడేలా స్మార్ట్‌ మీటర్లు ఏ విధంగా బిగిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే వ్యాపార సంస్థలకు, షాపులకు స్మార్ట్‌ మీటర్లు బిగించారని ఈ స్మార్ట్‌ మీటర్లతో బిల్లుల భారం పెరిగిందన్నారు. ఇప్పుడు గృహ వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తున్నారని, దొంగ చాటుగా ప్రజలు ఆమోదం లేకుండా మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. బిగించిన స్మార్ట్‌ మీటర్లకు బిల్లు ఇవ్వడం లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ట్రూ ఆఫ్‌ చార్జీలు పేరుతో ప్రజలపై రూ.12 వేల కోట్లు భారం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పి.మంగరాజు, ఎస్‌.మహంకాళి రావు, తామా ముత్యాలమ్మ, నగర కార్యదర్శి పంపన రవికుమార్‌, నగర కమిటీ సభ్యులు వైఎస్‌ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో నిర్మాణం పూర్తయిన మల్టీ పర్పస్‌ గోడౌన్లను తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ సహకార శాఖలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు నాబార్డ్‌ మంజూరు చేసిన 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన 24 మల్టీ పర్పస్‌ గోడౌన్స్‌లో 14 పూర్తి చేశామని, ఇంకా 10 నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. పూర్తయిన 14 గోడౌన్లు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేసి, పీఎసీఎస్‌లకు అప్పగించామన్నారు. ఇప్పటికే పూర్తయిన వాటిని వినియోగంలో తీసుకురావాలని ఆదేశించారు.

పోలవరం మండలం ప్రగఢపల్లిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. మంగళవారం సొసైటీ గోడౌన్‌కు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు ఆగ్రహించారు. 8లో u

ముదునూరి ప్రసాదరాజు

చంద్రబాబు పాలన మొత్తం ప్రజలను మోసం చేయడం, వంచించడమేనని మరోసారి రుజువైందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. నరసాపురంలో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం అందడం లేదన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటకు బీమా వంటి సదుపాయాలు లేవన్నారు. పంటను అమ్ముకునే పరిస్థితిలేని దయనీయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నేడు యూరియా సక్రమంగా దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. తమ గొంతునొక్కాలని చూసినా ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ బలంగా నిలబడుతుందన్నారు.

కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం

కూటమి ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. జగన్‌ పాలనలో ఏర్పాటు చేసిన వ్యవస్ధలను మార్చేయాలని దుర్మార్గమైన ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి వ్యవసాయం అంటే అసహ్యం. పంటలకు యూరియా వేస్తే క్యాన్సర్‌ వస్తుందని సీఎం అంటున్నారని రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు అని విమర్శించారు. యూరియాను కూటమిలోని ఒక పార్టీ నాయకులు దారి మళ్లిస్తున్నారు. రూ.200 నుంచి రూ.300 కోట్లు చేతులు మారాయని విమర్శించారు.

కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి

యూరియాను నల్లబజార్‌లో కొనాల్సి వస్తోంది. రైతుల పక్షాన జగన్‌ నిలబడి నిరసన కార్యక్రమాలు చేపట్టాక కూటమి ప్రభుత్వం మేల్కొంటుంది. మామిడి, పొగాకు, పత్తి రైతులు ప్రభుత్వ తీరు వల్ల తీవ్రంగా నష్టపోయారు. ఉల్లి రైతుదీ అదే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో దళారీ వ్యవస్ధ పెరిగిపోయింది. వైఎస్‌ జగన్‌ వ్యవసాయం పండుగ అంటే, ప్రస్తుత సీఎం దండగ అంటున్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా అందించాలి. రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుంది.

శ్రీ రంగనాథరాజు, మాజీ మంత్రి

ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆచంట నియోజకవర్గ కన్వీనర్‌, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ 5 ఏళ్ల పాలనలో రైతులకు ఇలాంటి కష్టాలు లేవన్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌మార్కెట్‌ను ప్రోత్సహిస్తూ రైతుల నడ్డివిరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్‌ మంత్రి రామానాయుడు సొంత ఇలాకా పాలకొల్లులో అక్రమ ఇసుక దందా సాగుతుందని విమర్శించారు. గోదావరి గట్లను కూడా అక్రమంగా తవ్వడానికి సిద్దంగా ఉన్నారన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

వైఎస్సార్‌సీపీ అన్నదాత పోరు విఫలయత్నానికి కూటమి కుట్రలు

అడుగడుగునా పోలీసులతో ఆంక్షలు

వెనక్కి తగ్గకుండా రైతు పోరును విజయవంతం చేసిన పార్టీ శ్రేణులు, రైతులు

ఆర్డీఓ కార్యాలయాల్లో వినతిపత్రాల సమర్పణ

గుడాల గోపీ, కన్వీనర్‌

14 నెలల పాలనలో కూటమి నేతల పాపాలు పండుతున్నాయని పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్‌ గుడాల గోపీ అన్నారు. యూరియా దొరక్క, పంట సాయం అందక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వాపోయారు.

ముదునూరి మురళీకృష్ణంరాజు

రైతుల పక్షాన పోరాడి ప్రభుత్వ మెడలు వంచుతాం. కష్టంలో రైతుల పక్షాన నిలబడాల్సిన కూటమి ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోంది. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, బీమా గాలికొదిలేసింది. జగన్‌ ప్రభుత్వం రైతులు నష్టపోయిన సందర్భంలో అన్ని రకాలుగా ఆదుకుంది.

అన్నదాత పోరు1
1/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు2
2/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు3
3/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు4
4/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు5
5/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు6
6/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు7
7/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు8
8/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు9
9/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు10
10/11

అన్నదాత పోరు

అన్నదాత పోరు11
11/11

అన్నదాత పోరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement