
సచివాలయ ఉద్యోగుల నిరసన
యలమంచిలి: ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వాట్సప్ గవర్నెన్స్ రిజిస్ట్రేషనన్, క్లస్టర్ మ్యాపింగ్ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయం జేఏసీ పిలుపు మేరకు మంగళవారం సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఆ పనులను సచివాలయ ఉద్యోగులతో చేయించడం సచివాలయ ఉద్యోగుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించేదిగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఈఓపీఆర్డీ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు షేక్ ఉమర్ అలీషా, డియువి సత్యనారాయణ, గోనిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.