
కాంట్రాక్టర్‌పై చర్యలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ద్విచక్ర వాహనంతో నేరుగా పేషెంట్ల వార్డులోకి వెళ్లి ఫుడ్ సప్లయి చేస్తున్న కాంట్రాక్టర్‌పై వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం సెలవులో ఉన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధురి ఫోన్లో మాట్లాడుతూ పత్రికల్లో వచ్చిన వార్తపై నర్సింగ్ సిబ్బందికి మెమో ఇచ్చినట్లు తెలిపారు. మంగళవారం కాంట్రాక్టర్ ఫుడ్ ప్యాకెట్లు కాకుండా పాత్రల్లో ఫుడ్ తీసుకువచ్చారన్నారు. ఓ ట్రాలీలో డిష్‌లు ఏర్పాటుచేసి డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామన్నారు. కాంట్రాక్టర్ నేడు వివరణ ఇస్తానని చెప్పినట్లు డాక్టర్ మాధురి తెలిపారు.

కాంట్రాక్టర్‌పై చర్యలు