
ఉద్యోగాలకు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఎంపిక
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో నాలుగో సంవత్సరం ఈసీఈ చదువుతున్న విద్యార్థులు ఇద్దరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. విద్యార్థి యుగంధర్ ఓమ్నీ డిజైన్స్ అనే కంపెనీకి ఇంటర్న్‌షిప్‌తో పాటు ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.50 వేలు ఏడాది పాటు ఇవ్వనున్నారు. అనంతరం ఏడాదికి రూ.18 లక్షల వార్షిక వేతనాన్ని కంపెనీ ఆఫర్ చేసింది. అలాగే మరో విద్యార్థిని కమలప్రియ ఎన్‌ఎక్స్‌పీ సెమీ కండక్టర్ కంపెనీకి ఎంపికై ంది. ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌కు వెళ్లనుంది. ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ.40 వేల స్టైఫండ్‌ను కంపెనీ అందించనుంది. అనంతరం ఏడాదికి రూ.25 లక్షల వార్షిక వేతనంను అందించనుంది. విద్యార్థులను నూజివీడు ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బీ లక్ష్మణరావు అభినందించారు.