
థింక్ ఇండియా దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్ ఆవిష్కరణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): థింక్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో తమిళనాడులోని ఐఐటీ మద్రాసు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్)లో నిర్వహించనున్న దక్షిణాపథ్ సమ్మిట్ పోస్టర్‌ను ఏపీ నిట్‌లో మంగళవారం నిట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జి.రవికిరణ్ శాస్త్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేథ వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగించి విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, యువత సృజనాత్మక ఆలోచనలు, ప్రతిభను సద్వినియోగం చేసుకుని దేశాన్ని ప్రపంచ దేశాలకు దీటుగా పురోగతివైపు నడిపించడం వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారని చెప్పారు. పోస్టర్ ఆవిష్కరణలో రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి, అసోసియేట్ డీన్‌లు డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ కార్తికేయ శర్మ తదితరులు పాల్గొన్నారు.