
నాసిరకం ఉల్లిపాయలు అమ్మలేం
తాడేపల్లిగూడెం: కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలను కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో వాటిని అమ్మలేకపోతున్నామని బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో వ్యాపారులు ఆర్‌డీఓ ఖతీబ్ కౌసర్ భానోకు తెలిపారు. మార్కెట్‌లో ఉల్లి లావాదేవీలను మంగళవారం ఆర్‌డీఓ పరిశీలించారు. వ్యాపారవర్గ ప్రతినిధి నంద్యాల కృష్ణమూర్తి ఆర్‌డీఓతో మాట్లాడుతూ వచ్చిన ఉల్లిపాయల్లో నాణ్యత లేనందున పాట పెట్టినా కొనేందుకు ఎవ్వరూ లేని కారణంగా వీటిని విక్రయించలేకపోతున్నామన్నారు.
కామవరపుకోట:: ప్రోహిబిషన్, ఎకై ్సజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం సారా బట్టీలపై దాడులను నిర్వహించి పలువురిపై కేసు నమోదు చేసినట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. చింతలపూడి మండలం తలార్లపల్లిలో 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, 5 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, నిందితుల పరారీపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే కామవరపుకోట మండలం తాడిచెర్లలో పాత సారా కేసులో ఏ2 నిందితుడిగా పరారీలో ఉన్న వాక దేవాంజనేయులును అదుపులో తీసుకొని చింతలపూడి కోర్ట్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు చెప్పారు.
ఏలూరు రూరల్: ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఏలూరులో రాష్ట్రస్థాయి బాలబాలికల అథ్లెటిక్స్ పోటీలు చేపట్టనున్నట్లు ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా జట్లు ఎంపిక పోటీలు ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్నామని వెల్లడించారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పోటీలు జరుగుతాయని, ఆసక్తి గలవారు 15వ తేదీ ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ, ఆధార్ ధ్రువీకరణ పత్రాలతో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంకు హాజరుకావాలన్నారు. వివరాలకు 86865 40555 నంబర్లలో సంప్రదించాలన్నారు.
కాళ్ల: సీసలి గ్రామంలో దళితులపై దాడులను నిరసిస్తూ మంగళవారం గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాలమహనాడు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ గత కొంతకాలంగా సీసలి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఏర్పడిన భూ వివాదాన్ని అధికారులు పరిష్కరించలేకపోయారన్నారు. దళిత యువకులు, మహిళలపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు 307 కేసును పెట్టాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి కర్ని జోగయ్య, కోన జోసెఫ్ మీసాల జయరాజు, కాళ్ళ ఉండి అధ్యక్షుడు గుజ్జుల నిరీక్షణ రావు తదితరులు పాల్గొన్నారు.

నాసిరకం ఉల్లిపాయలు అమ్మలేం

నాసిరకం ఉల్లిపాయలు అమ్మలేం