
భీమవరంలో కలెక్టరేట్ కోసం దీక్ష
భీమవరం(ప్రకాశం చౌక్): స్థానిక మార్కెట్ యార్డ్‌లోనే కలెక్టరేట్ భవనం నిర్మించాలని భీమవరానికి చెందిన నాయ్యవాది జవ్వాది సత్యనారాయణ (సత్తిబాబు), రాట్నాల శ్రీనివాసరావు స్థానిక ప్రకాశం చౌక్ సెంటర్‌లో మంగళవారం రిలే నిరహార దీక్ష చేపట్టారు. గతంలో ఇచ్చిన జీవో ప్రకారం మార్కెట్‌యార్డ్‌లోనే కలెక్టరేట్ నిర్మాణం చేపట్టాలని, భీమవరం నుంచి కలెక్టరేట్ తరలింపు ప్రయత్నాలు మానుకొవాలని కోరారు. రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంట్ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, భీమవరం నియోజకవర్గ ఇన్‌చార్జి చినిమిల్లి వెంకటరాయుడు దీక్షాదారులకు సంఘంభావం ప్రకటించారు. భీమవరంలోనే కలెక్టరేట్ ఉండాలని పోరాటం చేసే ప్రతి ఒక్కరికీ పార్టీ తరుఫున మద్దతు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణాధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పాలవెల్లి మంగ, బొత్స ధర్మ తదితరులు పాల్గొన్నారు. దీక్షకు సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు మద్దతు తెలిపారు.