
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఇరగవరం: మండలంలోని అయినపర్రు పొలాల్లో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఇరగవరం హెడ్ కానిస్టేబుల్ ఐ.కృష్ణారావు తెలిపారు. నీలం రంగు జీన్స్, ఆరెంజ్ రంగు టీ షర్టు ధరించాడని, 30 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉంటుందని.. ఎత్తు 5 అడుగుల 8 అంగుళాలు ఉంటుందని చెప్పారు. వీఆర్వో సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పంచనామా నిమిత్తం తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9440796681, 9440796639 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. విశ్వసనీయ సమచారం ప్రకారం మృతుడి జేబులో నాలుగు సెల్‌ఫోన్లు ఉన్నాయని అతను ఫోన్లు దొంగిలించడానికి వచ్చిన దొంగగా భావిస్తున్నారు.
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో చంద్రగ్రహణం విడుపుకాలం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు దానాలు సమర్పించుకున్నారు. క్యూలైన్లు నిండిపోయాయి. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు సప్త సోమవారం ప్రదక్షిణల్లో పాల్గొన్నారు. అనంతరం పంచహారతుల కార్యక్రమం నిర్వహించారు.