
10న క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీస్
భీమవరం: భీమవరం పట్టణంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ సెమీఫైనల్స్ ఈ నెల 10న జరుగుతాయని కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు సోమవారం తెలిపారు. ప్రిన్సిపల్ కేవీ మురళీకృష్ణంరాజు, టెక్నాలజీ సెంటర్ హెడ్ ఎన్.గోపాలకృష్ణమూర్తితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఈ పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల్లోని 20 ఇంజనీరింగ్ కళాశాలల నుంచి 40 బృందాలకు సంబంధించి 240 మంది విద్యార్థులు హాజరవుతున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 8:30 గంటలకు కళాశాల ఓపెన్ ఆడిటోరియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జేఎన్టీయూ కాకినాడ వైస్ చాన్స్‌లర్ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్ హాజరవుతారని న్యాయ నిర్ణేతగా ఉన్నత విద్యా మండలి మాజీ వైస్ చైర్మన్, ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్‌ఎస్‌ఈ విభాగం ప్రొఫెసర్ వి.వల్లికుమారి వ్యవహరిస్తున్నారన్నారు.