
జీడిమామిడి కనుమరుగు
కట్టెలుగా మారుతున్న జీడిమామిడి తోట
● సరైన ప్రోత్సాహం లేక తోటలు నరికివేత
● ఏజెన్సీ మండలాల్లో 6 వేల ఎకరాలకు పడిపోయిన విస్తీర్ణం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత అత్యధికంగా గిరిజనులు జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఐటీడీఏ ద్వారా ఈ ప్రాంతంలో సుమారు 20 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి పంట వేశారు. ప్రస్తుతం జీడిమామిడి పంటల స్థానంలో రైతులు ప్రత్యామ్నాయ పంట వైపు దృష్టి సారించారు. దీంతో జీడిమామిడి తోటలను తొలగిస్తున్నారు. తోటల స్థానంలో పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, అరటి వంటి వాణిజ్యపంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 5 వేల ఎకరాల వరకూ రైతులు జీడిమామిడి తోటలను తొలగించినట్లు సమాచారం. భవిష్యత్‌లో ఇంకా తగ్గే అవకాశం ఉంది.
ప్రోత్సాహం కరువు
ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన మండలాల్లో గిరిజన రైతులు జీడిమామిడి పంటల సాగుతో అధిక లాభాలను సాధిస్తున్నారు. అయితే గిట్టుబాటు ధరతోపాటు సరైన ప్రోత్సహం ఐటీడీఏ ద్వారా అందించకపోవడం వల్ల వాణిజ్యపంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కొండరెడ్డి గ్రామాల్లో పోడు వ్యవసాయం తర్వాత జీడిమామిడి పంటలే ప్రధానం. దీనిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు.
జీడిమామిడి రైతులను ఐటీడిఏ అధికారులు ప్రోత్సహించాలి. జీసీసీ ద్వారా జీడిగింజలను కొనుగోలు చేసి గిరిజన రైతులు ఆదాయం పొందేలా చూడాలి. రానురానూ జీడిమామిడి పంటల విస్తీర్ణం తగ్గిపోతోంది.
కారం రాఘవ, న్యూడెమోక్రసీ నేత, అలివేరు, బుట్టాయగూడెం మండలం
గిరిజన ప్రాంతంలో ఎంతో మంది రైతులకు లాభాలు అందించిన జీడిమామిడి తోటలు నేడు నరికేస్తున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో అత్యధికంగా జీడిమామిడి పంటలను రైతులు తొలగిస్తున్నారు. చెట్లను నరికి కట్టెలుగా మార్చి బేరన్ పుల్లగా తరలిస్తున్నారు. కలపను తరలించి ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటల కోసం భూములను సిద్ధం చేస్తున్నారు.

జీడిమామిడి కనుమరుగు

జీడిమామిడి కనుమరుగు