
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం భక్తులతో ఆదివారం కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. దేవస్థాన సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.19,185 ఆదాయం వచ్చిందని తెలిపారు.
దెందులూరు: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతంపేట సమీపంలోని రైల్వేస్టేషన్ వద్ద వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. అతని ముఖం గుర్తించడానికి వీలు లేకుండా ఉంది. మృతుడు ఎరుపు రంగు చొక్కా ధరించాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని.. ఇతర వివరాలకు ఏలూరు రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు.