రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత | - | Sakshi
Sakshi News home page

రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత

Sep 6 2025 4:29 AM | Updated on Sep 6 2025 4:29 AM

రేపు

రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత

రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత ప్రభుత్వాస్పత్రుల సేవలో ‘పశ్చిమ’ మేటి హాస్టళ్ల తరలింపు సరికాదు ఎరువుల సరఫరాపై శ్రద్ధ చూపాలి

ద్వారకాతిరుమల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఆదివారం మహానివేదన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామ ని ఆలయ ఈఓ ఎన్‌వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సోమవారం (8వ తేదీన) పుణ్యహవాచనం అనంతరం ఉదయం 9.30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 7న సాయంత్రం జరగాల్సిన ఆర్జిత సేవలను, 8న వేకువజామున జరగాల్సిన సుప్రభాత సేవను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మిగిలిన అన్ని సేవలు యథావిధిగా జరుగుతాయన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

భీమవరం (ప్రకాశం చౌక్‌): పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలను పేదలకు చేరువ చేయడంలో అధికారుల కృషికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన ఐవీఆర్‌ఎస్‌ ఫలితాలే సాక్ష్యం అని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటనలో వివరాలు వెల్లడిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల సేవలపై 79.6 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారని, ఇది రాష్ట్రంలో 26వ జిల్లాల్లో అత్యధిక సంతృప్తి స్థాయి అని పేర్కొన్నారు. అలాగే రక్తపరీక్షలకు సంబంధించి 64.7 శాతం మంది, మందుల పంపిణీ గురించి 73.4 శాతం మంది, వైద్య సిబ్బంది అందించే సేవలపై 75.1 శాతం మంది సంతృప్తి చెందారని తెలిపారు. మొత్తంగా ప్రభుత్వ ఆసుపత్రి సేవల్లో 73.4 శాతం నమోదు చేసుకుని మొదటి స్థానంలో పశ్చిమగోదావరి నిలిచిందని కలెక్టర్‌ తెలిపారు. అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేసిన కలెక్టర్‌ను పలువురు అభినందించారు.

కొయ్యలగూడెం: ప్రభుత్వ హాస్టళ్ల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, వాటి బదిలీ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక మెయిన్‌ సెంటర్‌లో ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు చేపట్టిన ఆందోళన శిబిరానికి బాలరాజు వెళ్లి సంఘీభావం తెలిపారు. కొయ్యలగూడెంలోని ప్రభుత్వ బీసీ హాస్టళ్లు రెండింటినీ వేరే మండలాలకు తరలించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థులు అత్యధిక శాతం హాజరయ్యే కొయ్యలగూడెంలోని హా స్టళ్లను తరలించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. కూటమిలోని నా యకులు రాజకీయాలు మాని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కొయ్యలగూడెం వల్లే పోలవరం అసెంబ్లీ స్థానాన్ని కూటమి గెలవగలిగింది అనేది జగమెరిగిన సత్యం అని, అయితే కొ య్యలగూడెంలో విద్యారంగాన్ని అణగదొక్కేలా కుట్రలు జరుగుతున్నాయన్నారు. కార్పొ రేట్‌ సంస్థలతో కలి ప్రభుత్వ విద్యారంగాన్ని అడ్డుకోవడం దారుణమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు డి.శివకుమార్‌, ఎం.క్రాంతి కుమార్‌, తాడిగడప ఆంజనేయరాజు తది తరులు పాల్గొన్నారు.

ఏలూరు(మెట్రో): ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న సొసైటీలకు యుద్ధప్రాతిపదికన సరఫరా చేయాలనీ కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై వ్యవసాయాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎరువుల నిల్వలు తక్కువగా ఉన్న పెదపాడు, పెదవేగి, ఏలూరు, దెందులూరు, కలిదిండి, ముదినేపల్లి, బుట్టాయగూడెం, చింతలపూడి, ఆగిరిపల్లి, కుక్కునూరు, వేలేరుపా డు మండలాలకు 500 టన్నుల యూరియాను పంపామన్నారు. యూరియా పంపిణీ, రైతుల సందేహాల నివృత్తి కోసం ఏలూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ రూ మ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. 85004 21967, 89850 21117 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత 
1
1/1

రేపు మధ్యాహ్నం ఆలయం మూసివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement