
వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌సీపీ ఉపాధ్యాయ విభాగం, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ఆధ్వ ర్యంలో గురుపూజా దినోత్సవం సందర్భంగా శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గు రువులను సన్మానించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఉపాధ్యాయులను సన్మానించగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బొడ్డు రాంబాబు, సున్నం శ్రీనివాసరావు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్ రెడ్డి, గడ్డం సుధీర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కె.జాల్ రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌టీఏ ఆధ్వర్యంలో గురువులకు సన్మానం