
కూటమికి కొమ్ముకాస్తున్న విద్యుత్ అధికారులు
ఉండి: కూటమి నాయకులకు విద్యుత్ అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ పాములపర్రు దళిత శ్శశాన వాటిక వద్ద శుక్రవారం దళితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత శ్శశాన వాటికలో గ్రామానికి చెందిన ఆక్వారైతు అక్రమంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, మీటరు ఏర్పాటు చేయగా గతనెల 4న ఉండి విద్యుత్ ఏఈ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు. అయినా పట్టించుకోకపోవడంతో తిరిగి గతనెల 22న ఎన్నార్పీ అగ్రహారంలో విద్యుత్ సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. దీనిపై స్పందించిన విద్యుత్ అధికారులు 23న సదరు ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేశారన్నారు. అయితే కూటమి నాయకుల ఒత్తిళ్లతో ఈనెల 4న ట్రాన్స్‌ఫార్మర్‌కు తిరిగి విద్యుత్ సరఫరా ఇచ్చారని ఆరోపించారు. ముందుగా దళితులకు న్యాయం చేసినట్టు నటించిన విద్యుత్ అధికారులు ఇప్పుడు కూటమి నాయకులకు ఒత్తాసు పలకడం దారుణమన్నారు. దళిత శ్మశాన వాటికలోని ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎలా విద్యుత్ కనెక్షన్ ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
పాములపర్రులో దళితుల నిరసన