
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
ఉంగుటూరు: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పంట బోదెలోకి బోల్తా పడడంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన నారాయణపురంలో చోటుచేసుకుంది. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామానికి చెందిన సింగులూరి రాంబాబు (59) భీమవరంలో ట్రాక్టరుపై డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌పై చేపల మేతలోడు భీమవరం నుంచి భీమడోలు మండలం గుండుగొలను తీసుకువెళ్లి అక్కడ దించేసి ఖాళీ ట్రాక్టరుతో తిరిగి భీమవరం వస్తున్నాడు. చేబ్రోలు వంతెన మీదనుంచి నారాయణపురం పుంత రహదారిమీదుగా వెళుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న పంట బోదెలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య వరలక్ష్మి ఇద్దరు కుమారులు ఉన్నారు. మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పజెప్పగా అంత్యక్రియలు నిర్వహించారు. చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి