
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
పాలకొల్లు సెంట్రల్: తండ్రికి కుమార్తె తలకొరివిపెట్టిన ఘటన పాలకొల్లులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బ్రాడీపేట మూడవ వీధికి చెందిన సారిక సత్యనారాయణ (80) గత రెండేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉండి నియోజకవర్గం కాళ్ల గ్రామంలో ఉంటున్న కుమార్తె తండ్రి సత్యనారాయణ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పెన్షన్‌తోనే జీవనం సాగించే సత్యనారాయణకు సచివాలయ సిబ్బంది ఉదయం సుమారు 8 గంటల సమయంలో పింఛన్ ఇవ్వడానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. సర్వర్ పనిచేయకపోవడంతో పింఛన్ పంపిణీ ఆలస్యమైందని చెబుతున్నారు.