
కూటమి పాలనలో పెచ్చుమీరిన దౌర్జన్యాలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వల్ల తమకు ప్రాణహాని ఉందని పెదవేగి మండలం పినకడిమి సర్పంచ్ సునీత భర్త పలగాని శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం దెందు లూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే చింతమనేని, ఆయన గన్‌మన్, మరో వ్యక్తి రవి దౌ ర్జన్యంగా తన పొలంలోకి వచ్చి అన్యాయంగా దాడి చేయడంతో పాటు తమపైనే కేసు పెట్టడం ఎంతవరకు న్యాయమని కన్నీటిపర్యంతమయ్యారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మేక లక్ష్మణరావు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో బలమైన గౌడ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ భర్తపై దాడి, దౌర్జన్యం చేయడమే కాకుండా వారు సాగు చేసుకుంటున్న పొలాన్ని ఆక్రమించాలని చూ డటం విచారకరమన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న సర్పంచ్ దంపతులకు చెందిన భూమిలోకి ఎమ్మెల్యేగానే వెళ్లాల్సిన అవసరం ఏమిటని, ఏకంగా మహిళా సర్పంచినే స్పృహ కోల్పోయేలా కొడితే గ్రా మస్తులకు, నియోజకవర్గ ప్రజలకు రక్షణ ఏముంటుందని ప్రశ్నించారు. పెదవేగి ఎంపీపీ తాత రమ్యశ్రీ మాట్లాడుతూ మహిళా సర్పంచ్‌పై, ఆమె భర్తపై జరిగిన దాడి, దౌర్జన్యం బాధాకరమన్నారు. దీనిని గౌడ సామాజిక వర్గ మహిళలపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు మట్ట రమాశంకర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గన్‌మన్, మరో వ్యక్తి చేసిన దాడి, దౌర్జన్యం, దు ర్భాషలు సభ్య సమాజానికి, ప్రజాస్వామ్యానికి సి గ్గుచేటన్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో మీకు వస్తే మీ పరిస్థితి ఏమిటని నిలదీశారు.
పినకడిమి సర్పంచ్ భర్త శ్రీనివాసరావు