జెడ్పీ చైర్‌పర్సన్‌ కారుపై దాడి అమానుషం | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌ కారుపై దాడి అమానుషం

Jul 13 2025 4:31 AM | Updated on Jul 13 2025 4:31 AM

జెడ్పీ చైర్‌పర్సన్‌ కారుపై దాడి అమానుషం

జెడ్పీ చైర్‌పర్సన్‌ కారుపై దాడి అమానుషం

కై కలూరు: కూటమి పాలనలో మహిళలపై దా డులు పెరుగుతున్నాయని ముదినేపల్లి మండలానికి చెందిన వైఎస్సార్‌సీపీ ముదిరాజుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్థన్‌ అన్నారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గుడివాడలో జరిగే పార్టీ కార్యక్రమానికి హాజరవుతున్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారు అద్దాలను పగలగొట్టి కూటమి గూండాలు బీభత్సం చేయడం అత్యంత బాధాకరమన్నా రు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చ ర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మహి ళా ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

దాడులు దేనికి సంకేతం?

దెందులూరు: కృష్ణా జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ హారికపై దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడటం దుర్మార్గపు చర్య అని ఉమ్మడి పశ్చిమగోదా వరి జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయబాబు అన్నారు. శనివారం సాక్షితో ఆయన మా ట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. కూటమి ప్రభుత్వంలో సా మాన్య ప్రజానీకంతో పాటు జిల్లాస్థాయి ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందనే విషయాన్ని ఈ దాడి నిరూపించిందన్నారు. వెంటనే న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌ కార్యక్రమాన్ని ప్రకటించడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు.

ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలి

భీమవరం: విద్యా, వైద్యరంగాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, ఈ విధానాలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అన్నారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా ఆశావర్కర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు చింతపల్లి లక్ష్మి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ గిన్నిస్‌ బుక్‌ రికార్డు పేరుతో విద్య వైద్యరంగాలను ప్రభుత్వం నుంచి వేరు చేసే ప్రయత్నంలో భాగమే యోగా, తల్లిదండ్రుల సమావేశాలు అని విమర్శించారు. సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షుడు అంగన్‌వాడీ సంఘ రాష్ట్ర అధ్యక్షురాలు కె.బేబీ రాణి మాట్లాడుతూ ఆశావర్కర్లకు ప్రసూతి సెలవులు లేకుండా పనిచేయించుకోవ డం దారుణమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్‌రాయ్‌, యూనియన్‌ జిల్లా కార్యదర్శి డి.జ్యో తి మాట్లాడుతూ మూడేళ్లలో జిల్లాలో చేసిన పోరాటాలను వివరించారు.

భీమవరం స్టేషన్‌లో తనిఖీలు

భీమవరం: రైళ్లలో గంజాయి అక్రమ రవాణను అరికట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు జిల్లా అ దనపు ఎస్పీ వి.భీమారావు తెలిపారు. భీమవ రం టూటౌన్‌ పోలీసులు, ఈగల్‌ టీమ్స్‌, రైల్వే పోలీసులు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు సంయుక్తంగా శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో భీమవరం టౌన్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి బ్యాగులను, లగేజీలను నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌ సహాయంతో క్షుణ్ణంగా పరిశీలించామని భీమారావు తెలిపారు. గంజాయి, ఇత ర మాదక ద్రవ్యాలు లభించలేదన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగం గురించి సమాచారాన్ని టోల్‌ ఫ్రీ నంబరు 1972కు అందించాలని ప్రజలను కోరారు. భీమవరం టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.కాళీచరణ్‌ పాల్గొన్నారు.

వరదను సమర్థంగా ఎదుర్కొంటాం

యలమంచిలి: గోదావరిలో వరద పెరిగితే సమర్థంగా ఎదుర్కోవడానికి అధికార యంత్రాగం సన్నద్ధంగా ఉందని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు చెప్పారు. గోదావరిలో నీరు పెరు గుతున్న నేపథ్యంలో శనివారం ఆయన మండలంలోని లంక గ్రామాల్లో పర్యటించారు. కనకాయలంకలో కాజ్‌వే కింద నుంచి వరద నీరు పాక్షికంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. వరద పెరిగితే ఇంజన్‌ పడవలు ఏర్పాటు చేస్తామని, ప్రజలు నిత్యావసరాలను ముందుగానే నిల్వ చేసుకోవాని సూచించారు. కనకాయలంక, పెదలంకలో ప్రజలను అప్రమత్తం చేసేలా టాంటాం వేయించాలని తహసీల్దార్‌ గ్రంధి నాగ వెంకట పవన్‌కుమార్‌ను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement