
మీ మెడకే చుట్టుకుంటుంది
కోకో దిగుమతులు ఆపాలి
విదేశీ కోకో గింజల దిగుమతులను నిలుపుదల చేసి, కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం డిమాండ్ చేసింది. 8లో u
మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
తాడేపల్లిగూడెం రూరల్: చెడు సంస్కృతిని మొదలుపెడితే అది మీ మెడకే చుట్టుకుంటుందనే విషయాన్ని గుర్తించాలని మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని మాధవరంలో వైఎస్సార్‌సీపీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ హారిక కారుపై దాడి చేసి, దుర్భాషలాడి టీడీపీ రౌడీలు విధ్వంసం సృష్టించారని, ప్రస్తుతం బాబూ ష్యూరిటీ– గూండాయిజం గ్యారంటీ అనే చందంగా ప్రభుత్వ పాలన మారిందని విమర్శించారు. ఒకప్పుడు పవన్ చంద్రబాబు, లోకేష్‌ను విమర్శించారని, నేడు ఒకే గూటికి చేరారన్నారు. పవన్ పొలిటికల్‌గా అట్టర్ ప్లాప్ అని ఎద్దేవా చేశారు. 10వ తరగతి పరీక్షలు వాల్యుయేషన్ జవాబుదారీతనం లేకుండాపోయిందన్నారు. చైనా బ్యాచ్ గుప్పెట్లో విద్యా వ్యవస్థఉందన్నారు. రాష్ట్రానికి సీఎంగా ఉండి ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి, పవన్ కళ్యాణ్‌కు గ్యాప్ వచ్చినట్టు ఉందన్నారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకోబోమంటూ చిర్రుబుర్రులాడుతున్నాడని, ఊరుకోకపోతే పేడ పిసుక్కుంటావా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రానంత వరకే వ్యక్తిగతం అని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ప్రశ్నిస్తారన్నారు. జగన్ 2.0లో హాలీవుడ్ స్థాయిలో సినిమా చూపిస్తామని హెచ్చరించారు. ఇటీవల తనపై అవినీతి ఆరోపణలు చేశారని, దానికి ఆధారాలు చూపించాలని ఆయన సవాల్ విసిరారు.