
ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
దెందులూరు: గోపన్నపాలెం గ్రామంలో ఆదివారం ఆటో బోల్తా పడిన సంఘటనలో పెదపాడు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎనిమిది మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన డి.సాయికుమారి, సీహెచ్ నాగబాబులు ఏలూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కూలి పని కోసం కొత్తూరు నుంచి గోపన్నపాలెం గ్రామానికి వచ్చి పని ముగించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కూలీల ఆటో బోల్తా పడింది.