వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి

Jul 6 2025 6:26 AM | Updated on Jul 6 2025 6:26 AM

వైఎస్

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి

ఆకివీడు: వైఎస్సార్‌సీపీ జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి శివకుమార్‌ గౌడ్‌ను నియమిస్తూ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాళ్ల మండలం జువ్వలపాలెం సర్పంచ్‌గా పనిచేసిన కొండేటి పార్టీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు. తన సేవల్ని గుర్తించి బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ధన్యవాదాలు చెప్పారు. పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే ఉద్యమమే

భీమవరం: టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను నేలకేసి బద్ధలు కొడతామని ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించేస్తున్నారని దీనిపై ప్రభుత్వం పునరాలోచించకపోతే మరో బషీర్‌బాగ్‌ ఉద్యమం తప్పదని సీపీఐ పట్టణ కార్యదర్శి చెల్లబోయిన రంగారావు, సహాయ కార్యదర్శి మల్లుల శ్రీనివాసరావు హెచ్చరించారు. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించడాన్ని నిలిపివేయాలని, అదానీతో సోలార్‌ విద్యుత్‌ ఒప్పందం రద్దు చేయాలని, ట్రూఅప్‌ చార్జీలు రద్దు చేయాలని, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ భీమవరంలో విద్యుత్‌ ఏడీఈ కార్యాలయం వద్ద సీపీఐ, ఏఐటీయుసీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ వినియోగదారుల గొంతు కోసి అదానీ, షిర్డీ సాయి కంపెనీలను ఉద్ధరించడానికే కూటమి సర్కారు ముందుకెళ్తుతోందని ఆరోపించారు.

గీత కార్మికులపై కక్ష గట్టారు

భీమవరం: వైఎస్సార్‌సీపీ పాలనలో బెల్ట్‌ షాపులు, అక్రమ మద్యం అమ్మకాలను కట్టడిచేస్తే నేటి కూటమి ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు, మద్యం సిండికేట్లు, ఎకై ్సజ్‌ శాఖ ప్రత్యేక కూటమిగా ఏర్పడి రాజ్యాంగేతర శక్తిగా పాలన చేస్తున్నారని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదరి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం కడలి పాండు అద్యక్షతన జరిగిన భీమవరం డివిజనన్‌ కల్లుగీత కార్మికుల సమావేశంలో గీత కార్మిక సంఘం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో గీత కార్మికులకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గీత కార్మికుల కుటుంబాలపై కక్ష గట్టి విచ్చలవిడిగా బెల్టుషాపులు పెట్టించి కల్లు అమ్మకాలు లేకుండా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్స్‌గ్రేషియో రద్దుచేసి గీతకార్మిక కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. సమావేశంలో చింతపల్లి చినవీరాస్వామి, తుంగ సాయిబాబు, కొప్పిశెట్టి వెంకట సత్యనారాయణ, దొంగ సత్యనారాయణ, వీరవల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సముద్రపు రక్షణ గోడ పనుల పరిశీలన

నరసాపురం రూరల్‌: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దత్తత గ్రామం పీఎం లంకలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అనిరుథ్‌ ఎస్‌ పులిపాక, కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. పీఎం లంక గ్రామంలో డెలాయిట్‌ కంపెనీ, సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌తో కలిసి శనివారం పరిశీలించారు. డిజిటల్‌ భవన్‌లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను పరిశీలించి విద్యార్థులు ఏఏ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ పొందుతున్నారని అడిగి తెలుసుకున్నారు. సముద్రపు రక్షణ గోడ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. రక్షణ గోడ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. కేంద్ర మంత్రి వ్యక్తిగత సహాయకుడు విష్ణు సింగ్‌, ఆర్డీవో దాసిరాజు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి 
1
1/2

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి 
2
2/2

వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా కొండేటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement