ప్రజలకు ఏం చెప్పాలి? | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు ఏం చెప్పాలి?

Jul 1 2025 7:23 AM | Updated on Jul 1 2025 7:23 AM

ప్రజల

ప్రజలకు ఏం చెప్పాలి?

పోరు ఉద్ధృతం
ఉద్యోగ భద్రత కోసం మునిసిపల్‌ ఇంజనీరింగ్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల పోరు ఉద్ధృతంగా సాగుతోంది. తమను పర్మినెంట్‌ చేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. 8లో u
అన్నదాత గోడు పట్టదా?

మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎన్నికల్లో లెక్కకు మించి హామీలిచ్చాం.. ఏడాది కాలంలో చేసిందేమీ లేదు.. సుపరిపాలన అంటూ ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లి ఏం చెప్పాలి? ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలమా? ఇలాంటి పరిస్ధితుల్లో సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళితే అభాసుపాలవుతామని కూటమి ప్రజాప్రతినిధుల్లో అంతర్మథనం మొదలైంది. పొగాకు రైతులు మొదలుకొని మామిడి రైతుల వరకు, ఆక్వా ఇలా అన్ని రంగాలు పూర్తి నష్టాల బాటలో ఉంటే ప్రభుత్వం ఏం చేయలేకపోయిందనే భావన ప్రజల్లో ఉందని, ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్లతో చేసిన అభివృద్ధి ఇది అని చెప్పుకోవడానికి ఏం లేదంటూ అధికార పార్టీల నేతల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ తరుణంలో బుధవారం నుంచి సుపరిపాలన పేరుతో ఇంటింటికి వెళ్లేలా షెడ్యూల్‌ ఖరారైంది.

ఎన్నికల సమయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ లెక్కకు మించి హామీలిచ్చినా ఒక్కదానిపైన కూడా దృష్టి సారించకపోవడంతో సర్వత్రా విమర్శలతో పాటు ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుంది. ఈ తరుణంలో ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమం ఇబ్బందికరమనే వాదన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

ఊసేలేని కీలక హామీలు

ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఏడాది దాటినా తొలి అడుగు పడలేదు. మళ్లీ దాన్ని రూ.3700 కోట్లకు ప్రాజెక్టును ఖరారు చేస్తున్నట్లు రూ.1780 కోట్లు బడ్జెట్‌లో కేటాయిస్తామని 2026 మార్చికల్లా పూర్తి చేస్తామని ప్రకటించారు. మరో 8 నెలల సమయం ఉన్నప్పటికీ కనీసం ప్రాజెక్టు పనులపై క్షేత్రస్థాయిలో సమావేశం కూడా జరగలేదు. గతేడాది వరదల సమయంలో ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి శనివారపుపేట కాజ్‌వేను రూ.15 కోట్లతో నిర్మిస్తామని ప్రకటించారు. ఇంతవరకూ దాని ఊసే లేకపోవడం గమనార్హం.

క్రాప్‌ హాలిడేపై రాజకీయ ఒత్తిడి

ఉమ్మడి జిల్లాలో 2.52 లక్షల ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. రొయ్య ధర పతనం కావడం, ఇతర సమస్యలతో నర్సాపురం, ఆచంట, పాలకొల్లు మూడు నియోజకవర్గాల పరిధిలో 55 వేల ఎకరాల్లో క్రాప్‌ హాలిడే ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారడంతో రాజకీయ ఒత్తిడితో క్రాప్‌ హాలిడేను తెరమరుగు చేస్తున్నారు. నర్సాపురంలో ప్రతిష్టాత్మకమైన ఫిషరీస్‌ యూనివర్శిటీకి కూటమి పాలనలో గ్రహణం పట్టించారు. గత ప్రభుత్వం 40 ఎకరాల స్ధలాన్ని కేటాయించి రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించింది. కొంతమేరకు పూర్తి చేసి తరగుతులు కూడా ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో రైతుభరోసా కేంద్రాల్లో ఫిషరీస్‌ యూనివర్శిటీ విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.

రేపు ప్రత్యేక పూజలు

జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం అయ్యప్ప స్వామికి ఈ నెల 2న స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సంక్రాంతి నాటికి రోడ్లు ఎక్కడ?

జిల్లాలో రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. చిన్నపాటి గుంతలు, మరమ్మతులకు ఆస్కారమే లేకుండా అన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హడావుడి చేసి నవంబరులో టెండర్లు పిలుస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది సంక్రాంతి కల్లా చిన్న సమస్య కూడా ఉండదని ప్రకటించారు. దాదాపు రూ.100 కోట్లకుపైగా పనులు గుర్తించినట్లు ప్రకటించారు. ఏ ఒక్కటీ పూర్తి కాకపోగా రోడ్లు మరింత అధ్వానంగా మారాయి. ప్రధానంగా ఏజెన్సీ ఏరియా రహదారులైతే అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏజెన్సీలోని రేగులపాడు నుంచి రేపల్లి వరకు, పులిరామన్నగూడెం నుంచి గోగుమిల్లి వరకు, అలివేలు డ్యాం నుంచి అలివేలు వరకు ఇలా ప్రధాన రహదారులు అత్యంత దారుణంగా ఉన్నాయి. తడికలపూడి– జంగారెడ్డిగూడెం, శ్రీనివాసపురం– ములకలంపాడు, వీరవాసరం నుంచి బ్రాహ్మణచెరువు, పాలకోడేరు నుంచి అత్తిలి, భీమవరం– వెంప రహదారులది ఇదే పరిస్ధితి. ఏజెన్సీలో ఉన్న జాతీయ రహదారి, భీమడోలు నుంచి తణుకు జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఈ నెల 15న నారాయణపురం వంతెనకు భారీ రంధ్రం పడి రాకపోకలు నిలిచిపోయాయి.

న్యూస్‌రీల్‌

జిల్లాలో ఏడాదిగా ముందుకు పడని ప్రగతి

గిట్టుబాటు ధర లేక అన్నదాతల ఆక్రందన

ప్రతి నియోజకవర్గంలోనూ అధ్వాన్నంగా రహదారులు

సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు ఎలా వెళ్లాలి?

టీడీపీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అంతర్మథనం

వ్యవసాయ ఆధారిత జిల్లాలో గత ఏడాది కాలంలో రైతులు పూర్తిగా నష్టపోయారు. 52 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడికి టన్ను రూ.80 వేల నుంచి రూ.లక్ష పలకాలి. అయితే రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పతనమైంది. ప్రభుత్వ సబ్సిడీ లేకపోవడం, అనుబంధ పరిశ్రమలు లేక వేలాది మంది మామిడి రైతులు రోడ్డునపడే పరిస్థితి. గతంలో రూ.1140 పలికిన కిలో కోకో ఇప్పుడు రూ.400కు చేరింది. రాష్ట్రంలోనే ఏ జిల్లాలోని లేని విధంగా కోకో అత్యధిక సాగు ఏలూరు జిల్లాలో ఉంది. 36,150 ఎకరాల్లో కోకో సాగు చేసి ఏటా 12 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాగిస్తున్నారు. ధరలు పతనం కావడంతో నెలలు తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. ఆయిల్‌ఫామ్‌ రైతులదీ ఇదే పరిస్థితి. టన్నుకు రూ.2 వేల వరకూ ధర పతనమైనా ప్రభుత్వం స్పందించని పరిస్ధితి. పొగాకు రైతులు కూడా గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు.

ప్రజలకు ఏం చెప్పాలి? 1
1/2

ప్రజలకు ఏం చెప్పాలి?

ప్రజలకు ఏం చెప్పాలి? 2
2/2

ప్రజలకు ఏం చెప్పాలి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement