
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విరమించుకోవాలి
పెదవేగి: పెదవేగిలో ఏపీ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కోకో రైతుల ఇబ్బందులను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారో గమనించాలన్నారు. లాభాల్లో ఉన్న పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ ఆలోచన సరైంది కాదని హెచ్చరించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, దెందులూరు నియోజకరవ్గంలో రైతన్నల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం ప్రభుత్వం పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిందని, ఉమ్మడి రాష్ట్రంలో ఏకై క ఫ్యాక్టరీ పెదవేగి అని అన్నారు. ఈ పంటపై ఆధారపడి 11 వేల మంది రైతులు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నారని, ప్రస్తుతం రూ.10 నుంచి రూ.15 కోట్ల లాభాల్లో ఉందన్నారు. పెదవేగి ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తే దాని మీద ఆధారపడిన రైతుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రైతులను అన్ని విధాలుగా నష్టపరుస్తున్నామని దుయ్యబట్టారు. అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని రూ.80 కోట్లతో ఆధునికీరించిందన్నారు.
ధాన్యం డబ్బులు ఎప్పుడిస్తారు?
ప్రతి రైతు ఇంటి దగ్గర కోకో గింజల నిల్వలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ఇంటర్నేషల్ మార్కెట్ లో కోకో రూ.1000 ధర ఉంటే, ఇక్కడ మాత్రం రూ.450 మాత్రమే ఇవ్వడమేంటని ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు ఇంకా ఇవ్వలేదని వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో ఏ పంటకు మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు, దెందులూరు నియోజకవర్గ నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.