
అలసత్వాన్ని సహించేది లేదు
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదని కలెక్టర్ సి.నాగరాణి అధికారులను హెచ్చరించారు. సోమవారరం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్‌లో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీపసుకుంటామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.రాహూల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆరవల్లి ఘటనపై వినతులు
అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో ఇటీవల మాలలు, మాదిగల మధ్య జరిగిన గొడవలపై సోమవారం మాలలు, మాదిగలు వారి సంఘాల నాయకులతో వచ్చి కలెక్టర్‌కు వినతి పత్రాలు అందజేశారు.
ధాన్యం డబ్బులు చెల్లించాలి : మూడు నెలలు దాటినా రైతులకు కూటమి ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించకపోవడంపై సోమవారం కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నెలలు గడుస్తున్నా డబ్బులు చెల్లించకపోవడం సిగ్గు చేటన్నారు. ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ బడి తమకు కావాలంటూ పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెర్వు వెలమపేట విద్యార్థులు తల్లిదండ్రులతో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. పాఠశాలను గ్రామంలో మరో పాఠశాలలో విలీనం చేశారని, దాంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అక్కడి వరకూ వెళ్లి చదువుకోడానికి ఇబ్బంది పడుతున్నారన్నారు.
పంచాయతీరాజ్ సమస్యలపై వినతిపత్రం
పంచాయతీరాజ్‌లోని సమస్యలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీల సమస్యలపై వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం నాయకులు, పార్టీ నాయకులు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నేడి గిరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పంచాయతీల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. 15 ఆర్థిక సంఘం నిధులు మళ్లీంచి పంచాయతీల అభివృద్ధి కుంటిపడేలా చేశారన్నారు. అఖరికి సర్పంచ్‌లు, ఎంపీటీలకు వేతనాలు కూడా చెల్లిచడం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పంచాయతీ అభివృద్ధి కోసం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ఆయన పాలనలో పంచాయతీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టి కార్యక్రమాలను పక్కన పెట్టారన్నారు.
కలెక్టర్‌గా ఏడాది పూర్తి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా చదలవాడ నాగరాణి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జాయింట్ కలెక్టర్, పలువురు జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందేలా కలెక్టర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.