● నిర్లక్ష్యానికి నిదర్శనం
అధికారుల నిర్లక్ష్యంతో వైద్య సామాగ్రి, రోగులకు అవసరమైన మంచాలు నిరుపయోగంగా మారాయి. ఆకివీడు సీహెచ్‌సీకి గత ప్రభుత్వం రోగుల కోసం మంచాలు సరఫరా చేసింది. అయితే అధికారులు వాటిలో కొన్ని వినియోగించగా మిగిలిన వాటిని ఆసుపత్రి ఆవరణలోనే నిర్లక్ష్యంగానే వదిలేశారు. దీంతో మంచాలు ఎండకు ఎండి, వర్షానికి తడిచి నిరుపయోగంగా మారాయి. అలాగే గతంలో సీహెచ్‌సీకి మూడు ఫొటో థెరపీ యూనిట్లు దాతలు సమకూర్చగా వాటిలో ఒకటి పనికిరాకుండా పోవడంతో దానిని కూడా ఆసుపత్రి ఆవరణలోనే వదిలేశారు. దీంతో జిల్లా సామాజిక ఆరోగ్య కేంద్రం అధికారి సూచనల మేరకు వాటిని వేలం వేసేందుకు నిర్ణయించారు. పాత పరికరాలు, యూనిట్లు పాడైపోతే తీసివేయడం సహజమే. వాటిని సకాలంలో వినియోగించుకున్నప్పుడే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు. – ఆకివీడు
● నిర్లక్ష్యానికి నిదర్శనం


