చెత్తశుద్ధి కరువాయె!
భీమవరంలో అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లా కేంద్రం భీమవరంలోని శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. ఖాళీ స్థలాలు, మురుగు కాలువ లు, డ్రెయిన్లు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ప ట్టణంలోని డీఎన్నార్ కళాశాల సమీపంలోని డంపింగ్ యార్డుకు చెత్తను తరలించాల్సి ఉంది. అయి తే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో ఎక్కడి చెత్త అ క్కడే కనిపిస్తోంది. పలు వార్డుల్లోనూ చెత్త రోజుల తరబడి నిలిచి దోమలు విజృంభిస్తున్నాయని ప్రజ లు వాపోతున్నారు. దోమల నివారణ చర్యలను మున్సిపల్ అధికారులు చేపట్టడం లేదు.
భీమవరం.. పారిశుద్ధ్యం అధ్వానం
పట్టణంలోని డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేక మురుగునీరు పారడం లేదు. కాస్మోక్లబ్ నుంచి రవాణా శాఖ అధికారి కార్యాయాలనికి వెళ్లే రోడ్డులోని ము రుగు కాలువ వద్ద భారీగా చెత్త, ఖాళీ కొబ్బరి బొండాలు పేరుకుపోయాయి. అలాగే కలెక్టరేట్‌కు వెళ్లే దారిలోని మురుగు కాలువలు, మెంటేవారితోట మ ధ్యలో ఉన్న డ్రెయిన్ చెత్తతో నిండిపోయాయి. రా యలం డ్రెయిన్‌లో గాయత్రి ఆస్పత్రి సమీపాన ఉన్న వంతెన వద్ద చెత్తగా భారీగా అడ్డుపడి దారుణంగా మారింది. పట్టణంలో ప్రవహిస్తున్న జంట కాలువల్లో పలుచోట్ల చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం ఇంతలా క్షీణిస్తున్నా మున్సిపల్, డ్రెయినేజీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కాలువలు, డ్రెయిన్లలో చెత్త వేస్తున్న వారిపై చర్యలు కూడా చేపట్టడం లేదంటున్నారు. చెత్త వేసే ప్రాంతాల్లో అధికారులు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా పెట్టడం లేదు.
తీరని డంపింగ్ యార్డు సమస్య
భీమవరంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో రోజురోజుకూ చెత్త పెద్ద సమస్యగా మారింది. పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరిస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ప్రభు త్వం ఏర్పడి 17 నెలలు గడుస్తున్నా ఈ దిశగా ఎ లాంటి చర్యలు తీసుకోలేదు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. అయినా ఇప్పటివరకూ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.


