ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం | - | Sakshi
Sakshi News home page

ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం

Dec 20 2025 9:20 AM | Updated on Dec 20 2025 9:20 AM

ఇళ్లు

ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం

ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం కేంద్ర విద్యా బిల్లుపై ఆగ్రహం 24 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగిన టెట్‌

కోళ్లపర్రు పట్టాదారుల ఆవేదన

ఆకివీడు: రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మావి.. రోడ్డు, డ్రెయిన్‌ పోరంబోకు ప్రాంతంలో 35 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం.. 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం పట్టాలిచ్చింది.. అప్పులు చేసి రేకుల షెడ్లు, చిన్నపాటి భవనాలు నిర్మించుకుని జీవిస్తున్నాం.. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తమ ఇళ్లు కూలుస్తామంటూ, రో డ్డుకు ఈడుస్తోంది.. అంటూ కోళ్లపర్రుకు చెందిన బ్రిడ్జిపేట వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 15 రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేయడంతో సుమారు 70 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఎండీ ఫరూక్‌కు వినతిపత్రం సమర్పించారు. అలాగే వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్‌ దృష్టికి వైఎస్సార్‌సీపీ గ్రామ అధ్యక్షుడు పాశం నర్సింహం, బాధితులు సమస్యను తీసుకువెళ్లారు. బాధితులకు పునరావాసం కల్పించే వరకూ పట్టా భూములను ఖాళీ చేయించవద్దని, ఇతర ఆక్రమణదారులకు కూడా స్థలం కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్‌ నర్సింహరాజు దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని చెప్పారు. ఎమ్మె ల్యే ఆదేశాల మేరకే ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారని రమేష్‌ ఆరోపించారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌ మాట్లాడుతూ గతంలో పట్టాలిచ్చిన వారి వివ రాలు, పట్టాల జెరాక్సులు అందించాలని, ఉ న్నతాధికారులతో మాట్లాడతానని చెప్పారు.

ఉండి: కేంద్ర ప్రభుత్వం నూతన విద్యాబిల్లుకు ఆమోదం తెలపడంపై ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా ఉండి సెంటర్‌లో శుక్రవారం బిల్లు ప్రతులను దహనం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మండలాధ్యక్షుడు కె.రోహిత్‌ మాట్లాడుతూ 2018లో ప్రవేశపెట్టిన హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆఫ్‌ ఇండియా బిల్లును మార్చి వికసిత్‌ భారత్‌ శిక్షా అధిక్షక్‌ పేరుతో ఆమోదించడం దారుణమన్నారు. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈ వంటి సంస్థల స్థానంలో హెచ్‌ఈసీఐ వంటి ఒకే నియంత్రణా సంస్థను తీసుకురావడం ద్వారా ఉన్నత విద్యారంగాన్ని ఏకఛత్రాదిపత్యం కిందకు తేవడమే అన్నారు. ఎన్‌డీఏ ఆధ్వర్యంలో కార్పొరేట్లు, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోజనం కోసం విద్యారంగంలో మతతత్వం పెంపొందించేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఇది పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమే అని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లును తక్షణ మే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆర్టీసీలో అప్రంటీస్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో ఈనెల 24 నుంచి నిర్వహించనున్నట్టు ఆర్టీసీ జోనల్‌ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ వి.నీలియ ఓ ప్రకటనలో తెలిపారు. 24న మోటార్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌మన్‌ సివిల్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, 26, 27 తేదీల్లో ఎలక్ట్రీషియన్‌, 29, 30 తేదీల్లో డీజిల్‌ మెకానిక్‌ ట్రేడ్‌ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు విజయవాడ విద్యాధరపురం చెరువు సెంటర్‌లో ఉన్న ఆర్టీసీ జోనల్‌ శిక్షణ కళాశాలకు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటలకు హాజరుకావాలన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జెరాక్సులు తీసుకురావాలని సూచించా రు. మరిన్ని వివరాలకు సెల్‌ 7382900591, 7382900299, 7989790054, 8142188168 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరులో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్‌) శుక్రవారం కొనసాగాయి. 312 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్‌ కేంద్రంలో ఉదయం 175 మందికి 148 మంది, మధ్యాహ్నం 175 మందికి 164 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని, మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు.

ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం 
1
1/1

ఇళ్లు కూలిస్తే రోడ్డున పడతాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement