సెల్ సిగ్నల్స్‌తో సేఫ్
ఆకివీడు: కేసుల పరిష్కారంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ పోలీసులకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటనలే ఇందుకు తార్కాణం. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాథోడ్ సురేష్ భార్య సంధ్య విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విజయనగరం బయలుదేరారు. ఆమెను వెంబడిస్తున్న అగంతకుడు ఆకివీడు ప్రాంతం వచ్చేసరికి ఆమె హ్యాండ్ బ్యాగ్‌ను కాజేసి, పారిపోయే అవకాశం లేకపోవడంతో ఆకివీడు–చెరుకువాడ మధ్య రైలు నుంచి బ్యాగ్ బయటకు విసిరివేశాడు. ఈ విషయాన్ని సంధ్య ఆమె భర్తకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే రాథోడ్ స్పదించి సెల్ సిగ్నల్ ద్వారా బ్యాగ్ ఏప్రాంతంలో పడిపోయిందో గుర్తించారు. వెంటనే ఆకివీడు ఎస్సై హనుమంతు నాగరాజుకు ఫోన్ ద్వారా విషయం తెలియజేసి, సిగ్నల్ ప్రాంతంను తెలియజేశారు. ఎస్సై నాగరాజు హూటాహుటీన తన సిబ్బంది శివ, విజయ్‌లతో వెదకగా చెరుకువాడ దగ్గర బ్యాగ్‌ను గుర్తించి, దానిలోని ఆభరణాలు, సెల్‌ఫోన్‌ను మరో సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీశారు. విషయాన్ని కానిష్టేబుల్ రాథోడ్‌కు తెలియజేశారు. బాధితురాలు సంధ్యకు హ్యాండ్ బ్యాగ్ అందజేశారు. అగంతకుడి కోసం విచారణ చేపట్టారు.
ప్రమాదవశాత్తూ జారిపడిన బాధితుడి గుర్తింపు
ఇటీవల మండలంలోని కమతవానిగూడెంకు చెందిన వలస కార్మికుడు తిరుపతి నుంచి రైలులో ఆకివీడు వస్తుండగా మార్గమధ్యలో జారిపడిపోయాడు. రైలులో ఉన్న అతని బంధువులు వెంటనే ఆకివీడు పోలీసులకు తెలియజేశారు. బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా కావలి ప్రాంతంలో పడిపోయి ఉన్నాడని గుర్తించి ఆకివీడు ఎస్సై నాగరాజు వెంటనే సమీపంలోని పోలీసులకు తెలియజేడంతో అక్కడి పోలీసులు వెళ్లి గాయాలతో పడి ఉన్న అతడ్ని రక్షించి, వైద్యం అందజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు. హ్యాండ్ బ్యాగ్ చోరీ కేసును కూడా ఛేదించడంతో ఆకివీడు ఎస్సై నాగరాజుకు, పోలీస్ సిబ్బందికి పలువురు అభినందనలు తెలిపారు.
ఏడాది చివరికి ఎలక్ట్రిక్ బస్సులు
నూజివీడు: రాష్ట్రానికి ఈ ఏడాది చివరి నాటికి 750 ఎలక్ట్రిక్ బస్సులు రానున్న నేపథ్యంలో వాటిలో జోన్–2 పరిధిలోని విజయవాడకు 100 బస్సులు, కాకినాడకు 50, రాజమండ్రికి 50 బస్సులు చొప్పున కేటాయించనున్నట్లు ఆర్టీసీ జోన్–2 ఈడీ జీ విజయరత్నం పేర్కొన్నారు. నూజివీడులోని ఆర్టీసీ బస్సు డిపోను గురువారం ఆయన సందర్శించి అన్ని విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి డిపోను లాభాల్లో నడపాలన్నారు. బస్సులు సైతం సమయపాలనతో నడిచేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు రావడం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ఆర్టీసీపై డీజిల్ భారం సైతం తగ్గుతుందన్నారు. ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో బాగుంటే నూజివీడు డిపో నుంచి దూర ప్రాంతాలకు కచ్ఛితంగా బస్సు సర్వీసులను నడుపుతామన్నారు. బెంగళూరు, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు ఇప్పటికే సర్వీసులు నడుపుతున్నామన్నారు. నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను పెంచాల్సిన అవసరం ఉందని, పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తిరిగే సర్వీసులు కచ్ఛితంగా సమయానికి బయలుదేరి వెళ్లాల్సిందేనన్నారు. బస్టాండ్‌లో ఉండే కంట్రోలర్‌లు బస్సులు సమయానికి వెళ్తున్నాయా, లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాలన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సీహెచ్ సూర్యపవన్ కుమార్, ట్రాఫిక్ సీఐ జీ రాంబాబు, పలు యూనియన్‌లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తో కేసుల పరిష్కారం
లొకేషన్లు గుర్తించి కేసులను ఛేదిస్తున్న పోలీసులు


