జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం
కాళ్ల : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నమ్మకం.. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే మోసం, ద్రోహం అని ప్రజలకు కూటమి ఏడాది పాలనలో తెలిసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మండలంలోని పెద అమిరంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు కలిసి సోమవారం జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం ప్రజాకోర్టు చార్జ్‌షీట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదునూరి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలన, కూటమి ఏడాది పాలనపై ప్రజలకు అవగాహన కల్పించేలా పుస్తకాన్ని రూపొందించినట్టు చెప్పా రు. రాష్ట్ర ప్రజలు జగన్, చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుంటున్నారన్నారు. 2024 ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీలిచ్చి ఐదు కోట్ల ప్రజల్ని వెన్ను పోటు పొడిచారని ఎద్దేవా చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలను అమలుచేశారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయ త్నం చేస్తోందని ఆరోపించారు. కూటమి పాలనలో మోసపోయినట్టు ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎల్లవేళలా ప్రజల పక్షాన ఉంటుంద న్నారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలుచేసే వరకూ ఒత్తిడి తెస్తామని ముదునూరి తెలిపారు.
30 లక్షల మంది తల్లులకు ద్రోహం
నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రైతులకు అన్నదాత సుఖీభవ సాయం, మహిళలకు ఆడబిడ్డ నిధి (నెలకు రూ.1,500), నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పేరుతో 30 లక్షల మంది పిల్లలకు ద్రోహం చేశారన్నారు. అందరికీ తల్లికి వందనం ఇచ్చి అప్పుడు సంబరాలు చేసుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు.
జగన్ పాలనను గుర్తుచేసుకుంటూ..
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభు త్వంలో మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో మూడు పో ర్టులు తీసుకువస్తే కూటమి ప్రభుత్వం పక్కన పడేసిందన్నారు. అలాగే 17 మెడికల్ కాలేజీలను పూర్తిచేయగా వాటినీ పక్కన పెట్టేశారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మాట మీద నిలబడ్డ జగన్‌ను ప్ర జలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జులు చినమిల్లి వెంకట్రాయుడు (భీమవరం), గుడాల గోపి (పాలకొల్లు), రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్ర జయసరిత, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి, పెండ్ర వీరన్న, చిగురుపాటి సందీప్, కోడె యుగంధర్, గాదిరాజు రామరాజు, పేరిచర్ల విజయరామరాజు, మంతెన సునీల్‌వర్మ, పెనుమత్స ఆంజనేయరాజు, చేకూరి నరేంద్ర వర్మ, అంబటి రమేష్, కొండేటి శివకుమార్, నాయకులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు


