యోగా జీవితంలో భాగం కావాలి
నరసాపురం: యోగా దైనందిన జీవితంలో భాగం కావాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మొగల్తూరు మండలం కేపీపాలెం బీచ్‌లో యోగాసనాలు వేశారు. జిల్లాలో గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో 4,635 ప్రాంతాల్లో యోగా అభ్యసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందన్నారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, జిల్లా ఎస్పీ నయీం అస్మి, జేసీ టి.రాహూల్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ డి.శ్రీవేద, యోగా టీచర్ టి.శిరీష తదదితరులు పాల్గొన్నారు.
19న విష్ణు కళాశాలలో..
భీమవరం: యోగాంధ్రలో భాగంగా ఈనెల 19న భీమవరం విష్ణు కాలేజీ ఆవరణలో సుమారు 5 వేల మంది అథ్లెట్లు, క్రీడాకారులు, యువతతో యోగా ప్రదర్శన నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. సోమవారం కళాశాలలో ఏర్పాట్లను ఆమె పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.


