
బెల్టుషాపులపై 456 కేసులు
ఏలూరు టౌన్: జిల్లాలో బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఏ.అవులయ్య హెచ్చరించారు. స్థానిక ఎకై ్సజ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకూ 456 కేసులు నమోదు చేయడంతోపాటు బెల్టు షాపులు నిర్వహిస్తున్న 478 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న ఏలూరు రూరల్, పెదవేగి మండలం, భీమడోలులోని 5 ప్రైవేటు మద్యం షాపులను సీజ్ చేశామని ఆయన తెలిపారు. వీరిపై రూ.5 లక్షల అపరాధ రుసుము విధించామన్నారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో ఎమ్మార్పీ కంటే అదనంగా మద్యం అమ్ముతున్న కనకదుర్గ వైన్స్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 70 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే జిల్లాను నెలాఖరు నాటికి నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అవులయ్య తెలిపారు. జిల్లాలోని 140 గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలు ఉన్నాయని, ఈ గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేస్తూ నాటుసారా తయారీని నిరోధించామన్నారు. నవోదయం –2 పథకంలో భాగంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలు, నాటు సారాపై 14405 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య కోరారు.
ఏలూరు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అవులయ్య