ఇళ్ల కూల్చివేతపై నిరసన సెగలు
పాలకోడేరు: ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీలు నిర్వహించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆరు నెలల నుంచి పేదల ఇళ్ల కూల్చివేత సాగుతోందన్నారు. కాలుష్యం పేరు చెప్పి పేదలపై విధ్వంసం సష్టించడం సబబు కాదన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు కూల్చివేయడం అన్యాయమన్నారు. జిల్లాలో నీటి కాలుష్యానికి గల కారణాలను ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు పరిశీలించాలన్నారు. నిపుణులతో అధ్యయన కమిటీ వేసి నాలుగు మండలాల్లో అధ్యయనం చేయాలన్నారు. ఏళ్ల తరబడి నివసిస్తున్న పేదలను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమనడం అన్యాయమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.వాసుదేవరావు, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రఘురామ వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఉండి: పేదల ఇళ్లు జల కాలుష్యానికి కారణం అవుతున్నాయని ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఉండి సెంటర్‌లో గోపాలన్ మాట్లాడుతూ కాలుష్యంపై నిర్ధారణ జరగకుండా సొంత నిర్ణయాలు తీసుకుని బడాబాబులకు మే లు జరిగేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పెద్దల బాగు కోసం పేదలపై పగ సాధించడం అన్యాయమన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఇప్పుడు పనికిరావని చెప్పడం దా రుణంగా ఉందని మండిపడ్డారు. ధనికొండ శ్రీనివాస్, చీర్ల శేషు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల కూల్చివేతపై నిరసన సెగలు


