పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌

Apr 27 2025 12:50 AM | Updated on Apr 27 2025 12:50 AM

పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌

పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌

భీమవరం: పోక్సో కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భీమవరం వన్‌టౌన్‌ సీఐ ఎం నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం పట్టణానికి చెందిన మైనర్‌ బాలికకు ప్రస్తుతం గునుపూడిలో నివాసముంటున్న భీమవరం మండలం కొత్తపూసలమర్రు గ్రామానికి చెందిన ఎం లక్ష్మీవరప్రసాద్‌ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు లక్ష్మీవరప్రసాద్‌ను శనివారం అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధించినట్లు సీఐ నాగరాజు చెప్పారు.

మూడు మట్టి లారీల సీజ్‌

జంగారెడ్డిగూడెం : కేతవరంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను సీజ్‌చేశారు. కేతవరం చెరువు నుంచి రాత్రి సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, వీఆర్‌వో ఫిర్యాదు మేరకు పోలీసులు లారీలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్‌ కె.స్లీవజోజి చర్యలు తీసుకుంటారని స్టేషన్‌ రైటర్‌ సత్యనారాయణ తెలిపారు.

కరెంట్‌ షాక్‌తో

పెయింటర్‌ మృతి

ఏలూరు టౌన్‌: కరెంట్‌ షాక్‌తో పెయింటర్‌ మృతి చెందాడు. దెందులూరు మండలం పోతునూరు కు చెందిన లింగాల పరుశురాం (31) పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శనివారం ఏలూరు సుబ్రహ్మణ్యం కాలనీలో ఒక భవనానికి మొదటి అంతస్తులో ఐరన్‌పైపునకు రోలర్‌ బిగించి గోడకు పెయింటింగ్‌ వేస్తుండగా సమీపంలో 11కేవీ విద్యుత్‌ వైర్ల ద్వారా విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందాడు. ఏలూరు వన్‌టౌన్‌ ఎస్సై నాగబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీవారి కొండపై షార్ట్‌కట్‌ మార్గం మూసివేత

ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఉన్న షార్ట్‌కట్‌ మార్గాన్ని ఆలయ అధికారులు పూర్తిగా మూసివేశారు. స్వామివారి దర్శనానంతరం పలువురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ సమీపంలోని మార్గం గుండా కొండపైన నిత్యాన్నదాన భవనం, శివాలయం వద్దకు కాలినడకన వెళుతున్నారు. ఆ ప్రాంతంలో జేసీబీతో పూడిక పనులు జరుగుతున్నాయి. దీనిపై సాక్షి దినపత్రికలో ఈనెల 25న ‘శ్రీవారి కొండపై షార్ట్‌కట్‌ మార్గం వద్దు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఆలయ అధికారులు ఆ మార్గాన్ని ఇనుప బారిగేట్‌తో పూర్తిగా మూసివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement