హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పోకుసందర్శకుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పోకుసందర్శకుల తాకిడి

Published Mon, Mar 24 2025 2:26 AM | Last Updated on Mon, Mar 24 2025 2:25 AM

నరసాపురం రూరల్‌: రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్‌ సెంటర్‌ (ఐఎల్‌టీసీ)లో ఈపీసీహెచ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పో ఆదివారం 3వ రోజుకు చేరింది. సెలవురోజు కావడంతో ఉభయ గోదా వరి జిల్లాలు, పరిసర ప్రాంతాల నుంచి సందర్శకులు, కొనుగోలుదారులు పోటెత్తారు. దేశ నలుమూలల నుంచి వివిధ హస్తకళల కళాకారులు తమ ఉత్పత్తులతో 70కు పైగా స్టాల్స్‌ ఏ ర్పాటుచేశారు. పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, జార్ఖండ్‌, కేరళ, రాజస్తాన్‌, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి హస్తకళాకారులు తరలివచ్చారు. హస్తకళాకృతుల విక్రయం, ప్రదర్శనలతో ఐఎల్‌టీసీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రవేశం ఉచితం కావడం, చి న్నారులు ఆడుకునేందుకు ప్లేగేమ్స్‌, ఫుడ్‌కోర్టుల ఏర్పాటుతో సందడి నెలకొంది.

పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానం

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ కోసం అభ్యర్థులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. పది, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 550 పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారన్నారు. అభ్యర్థుల వయసు 21–24 మధ్య ఉండాలని, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని తెలిపారు. రూ.5 వేల స్టయిఫండ్‌, ఏక మొత్తంగా రూ.6 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తారన్నారు. ఎంపికైన వారికి ప్ర ధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద బీమా రక్షణ కల్పిస్తారని తెలిపారు.

యువతిపై లైంగిక దాడి.. ఏడుగురిపై పోక్సో కేసు

ఏలూరు టౌన్‌ : ఏలూరులో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతామని బెదిరించిన ఘటనలో ఏడుగురిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరులోని ఓ ప్రాంతానికి చెందిన యువతిని జేపీనగర్‌కు చెందిన ఆళ్ల వంశీకృష్ణ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆమైపె గతేడాది ఆగస్టులో లైంగికదాడికి పాల్పడ్డాడు, అలాగే పలుమార్లు అత్యాచారం చేశాడు. తమ వద్ద వీడి యోలు ఉన్నాయని, తాము చెప్పినట్టు వినకపోతే సోషల్‌మీడియాలో పెడతామంటూ వంశీకృష్ణ స్నేహితులు ఏనాదుల సాయిచరణ్‌, చిట్టూరి శివశంకర్‌ కూడా ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రు లు యువకులను నిలదీయగా వారిపై గొడ వకు దిగి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు పోలీసుల ను ఆశ్రయించటంతో వంశీకృష్ణ, సాయిచరణ్‌, శివశంకర్‌తోపాటు రాయి విజయ్‌, రాయి పా వని, ఏనాదుల సింహాద్రి, ఏనాదుల కార్తీక్‌పై ఏలూరు వన్‌టౌన్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10 వేల మందికి క్యాన్సర్‌ టీకాలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణకు 10 వేల మంది విద్యార్థులకు టీకాలు వేయించనున్నట్టు రోటరీ (3020) జిల్లా గవర్నర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోట రీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. క్లబ్‌ అధ్యక్షుడు ఎన్‌జీవీ స్వామి మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. అన్నార్తులకు, దివ్యాంగులకు ఆహారం అందజేస్తామన్నారు. స్థానిక సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌ సెంటర్‌లో రోటరీ పీస్‌ టవర్‌ నిర్మాణానికి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోటరీ అసిస్టెంట్‌ గవర్నర్‌ దాకారపు కృష్ణ, జిల్లా సెక్రటరీ కల్యాణ్‌రాజు, రోటరీ పీడీజీ డాక్టర్‌ పి.దామోదర్‌ రెడ్డి, డాక్టర్‌ లలిత పాల్గొన్నారు.

హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పోకుసందర్శకుల తాకిడి 1
1/1

హ్యాండీక్రాఫ్ట్స్‌ ఎక్స్‌పోకుసందర్శకుల తాకిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement