ఆర్డీఓ ప్రజావాణికి 38 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఓ ప్రజావాణికి 38 అర్జీలు

May 19 2026 1:52 AM | Updated on May 19 2026 1:52 AM

న్యూశాయంపేట: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌ (ఆర్డీఓ) కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రజల నుంచి కార్యాలయ ఏఓ ఫణికుమార్‌ అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి 38 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించినవి 18, మున్సిపల్‌, హౌసింగ్‌ శాఖకు 8, విద్యాశాఖ 1, పంచాయతీరాజ్‌ శాఖ 1, మిగితా శాఖలకు సంబంధించి దరఖాస్తులు 10 వచ్చినట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తులను ఆయా శాఖలకు పంపించినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement