విపత్తుల సమయంలో ప్రతీ నిమిషమూ కీలకమని, అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మాక్‌డ్రిల్‌లో భాగంగా ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, తహసీల్దార్లు శ్రీకాంత్, ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్, బోగి సురేష్, తదితరులు పాల్గొన్నారు.


