● నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి
నర్సంపేట : రౌడీషీటర్లు సత్ప్రవర్తన అలవర్చుకోవాలని స్థానిక ఏసీపీ రవీందర్‌రెడ్డి సూచించారు. సబ్‌డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు తన కార్యాలయంలో సోమవారం ఆయన కౌన్సెలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. పదేళ్లపాటు నేరాలకు పాల్పడని రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో జీవిస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇస్తే విచారణ చేసి రౌడీషీట్ తొలగిస్తామని చెప్పారు. హింసకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్టు ప్రయోగిస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన నేరాల్లో రౌడీషీటర్ల హస్తం ఉందన్నారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని చెప్పారు.


