సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం | - | Sakshi
Sakshi News home page

సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

నర్సంపేట : పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు పంజాల వెంకట్‌ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వేదిక లీగల్‌ సెల్‌ బాధ్యులు నీలం శ్రీధర్‌రావు, రహీమోద్దీన్‌, ఉపాధ్యక్షుడు రమేశ్‌, నాయకులు సాంబయ్య, మహేందర్‌, రవి, శ్రీను, మిట్టపల్లి అంజయ్య, ఏరుకొండ సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement