దుగ్గొండి : మండలంలోని నాచినపల్లి, పొనకల్, చలపర్తి, గిర్నిబావి గ్రామాల్లోని నర్సరీలను క్వాలిటీ కంట్రోల్ అధికారి హరీష, ప్లాటేషన్ జిల్లా మేనేజర్ రమేశ్ సోమవారం తనిఖీ చేశారు. నర్సరీల్లో పెంచిన మొక్కల సంఖ్య, రకాల వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ కోటగిరి భాస్కర్, ఏపీఓ శ్రీనివాస్, టీఏ రాజు, పంచాయతీ కార్యదర్శి కావ్య, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్, వనసేవక్ లలిత, తదితరులు పాల్గొన్నారు.
ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ చంద్రశేఖర్
నర్సంపేట రూరల్ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్‌గా జనరల్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖర్ నియమితులయ్యారు. సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ నేటి (ఈనెల 19) నుంచి 28వ తేదీ వరకు సెలవుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇన్‌చార్జ్‌గా చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కమిటీ ఎన్నిక
పర్వతగిరి : హిందూ సమ్మేళనం మండల కమిటీని మండల కేంద్రంలో సోమవారం ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా సర్పంచ్ చీదురు శంకర్, అధ్యక్షుడుగా చిదురాల వేణుగోపాల్, సభ్యులుగా ప్రతాప్‌రెడ్డి, చెవ్వు రాము, సురేందర్‌రావు, సంపెల్లి పరమేశ్వర్‌రావు, తీగల వీరస్వామి, రంగు జనార్ధన్, జూలపల్లి రాములు, సముద్రాల మల్లికార్జున్, గణేశ్, పోకల శంకర్, రాణాప్రతాప్, కొల్లూరి రవి, మధు, భాగ్యలక్ష్మి, సుభాషిణి, కృష్ణవేణి, హరిత, సునీత, మాధవి ఎన్నికయ్యారు. అనంతరం స్థానిక జేఆర్‌ఆర్ గార్డెన్స్‌లో ఈనెల 24వ తేదీన తలపెట్టిన హిందూ సమ్మేళనం కార్యక్రమ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఎప్‌సెట్ ర్యాంకర్‌కు
ఘన సన్మానం
వర్ధన్నపేట : తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈఏపీసెట్)లో రాష్ట్రస్థాయిలో 400వ ర్యాంకు సాధించిన మండలంలోని నల్లబెల్లికి చెందిన డిల్లీ రిత్విక్‌ను మాజీ జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, మాజీ ఎంపీటీసీ దుగ్యాల జ్యోతి మాధవరావు, మాజీ సర్పంచ్ ముత్యం సంపత్, మాజీ ఉపసర్పంచ్ బిర్రు చంద్రయ్య శాలువాతో సోమవారం సన్మానించారు. రిత్విక్ తల్లిదండ్రులను అభినందించారు. నాయకులు సురేశ్, యమునా చారి, వెంకటేశ్వర్‌రావు, కనకయ్య, కుమారస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
నివాళి
గీసుకొండ : మాజీ ఎంపీటీసీ దౌడు కోమల ఆదివారం మృతి చెందగా ఆమె మృతదేహానికి పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమవారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడి శివ, జిల్లా నాయకులు కొండేటి కొమరారెడ్డి, చాడ కొమరారెడ్డి, తుమ్మలపల్లి శ్రీనివాస్, సమన్వయ కమిటీ సభ్యులు ఆకుల రుద్ర ప్రసాద్, ప్రతిపాక రణవీర్, దూలం వెంకటేశ్వర్లు, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, ఊకల్ సర్పంచ్ సుభాష్, గంగాదేవిపల్లి సర్పంచ్ స్వరూప రమేశ్, చంద్రయ్యపల్లె సర్పంచ్ మౌనిక ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
కొత్తూరులో..
రాయపర్తి : మండలంలోని కొత్తూరు కాంగ్రెస్ గ్రామ కమిటీ సీనియర్ నాయకుడు గద్దె మాధవరావు తండ్రి అనుమయ్య అనారోగ్యంతో సోమవారం మృతి చెందగా ఆయన మృతదేహానికి టీపీసీసీ ఉపాధ్యాక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, నాయకులు నాగేశ్వర్‌రావు, వనజారాణి, పాల్వంచ కోటేశ్వర్, నయీమ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


