ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలి

నర్సంపేట : నర్సంపేట నియోజకవర్గంలో సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టాలని స్వచ్చంద సంస్థల బాధ్యులు గిరగాని సుదర్శన్‌, రాజశేఖర్‌ కోరారు. ఈ మేరకు సోమవారం ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో డివిజన్‌ స్వచ్చంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో ఆర్డీఓ ఉమారాణికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సుదర్శన్‌, రాజశేఖర్‌ మాట్లాడారు. సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ ప్లేట్లు, బిర్యాని కవర్లలో ఉంచిన ఘన, ద్రవ వేడి టీ, సాంబర్‌, ఆహార పదార్థాలు తినడం, తాగడం వల్ల వినియోగదారులు రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణ దిశగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లోనూ సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టేలా చొరవ చూపాలని కోరారు. వ్యాపారులను, వినియోగదారులను నియంత్రించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement