కళ్లకు కట్టినట్లు.. | - | Sakshi
Sakshi News home page

కళ్లకు కట్టినట్లు..

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

కళ్లకు కట్టినట్లు..

ప్రకృతి విపత్తులపై అప్రమత్తం చేసిన బృందాలు

ఆకర్షణగా నిలిచిన మాక్‌ డ్రిల్‌

సహాయక చర్యలు పరిశీలించిన అధికారులు

హన్మకొండ/ఖిలా వరంగల్‌: ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏం చేయాలి. ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి. మూగజీవాలను ఎలా రక్షించాలి. అపస్మారక స్థితికి చేరిన వారికి సీపీఆర్‌ ఎలా చేయాలి? తదితర అంశాలపై కళ్లకు కట్టినట్లు చూపించాయి పలుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు. ఖిలావరంగల్‌ ఏకశిల చిల్డ్రన్స్‌ పార్కు, హనుమకొండలోని సమ్మయ్యనగర్‌, ఇంజనీర్స్‌ కాలనీ, వివేక్‌ నగర్‌, టీఎన్జీఓస్‌ కాలనీ – 2, ప్రగతి నగర్‌, గోపాల్‌పూర్‌, జవహర్‌ కాలనీ, టీవీ టవర్‌ కాలనీల్లో సోమవారం నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాయి.

ఫొటోలు: సాక్షి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్లు హన్మకొండ /

వరంగల్‌

ఖిలా వరంగల్‌లో మాక్‌ డ్రిల్‌ను పరిశీలిస్తున్న

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

హనుమకొండలోని ప్రగతినగర్‌లో మాక్‌ డ్రిల్‌ను పరిశీలిస్తున్న హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement
 
Advertisement
Advertisement