హన్మకొండ చౌరస్తా: ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఒకటయ్యారు. గతంలో కొండా సురేఖపై మాజీ మంత్రి కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెరెడ్డి, బస్వరాజు సారయ్య అనేకసార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఘాటైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అవన్నీ పక్కనపెట్టి మేమంతా ఒక్కటే అంటూ ఐక్యతా రాగాన్ని ఆలపించారు. సోమవారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందరూ కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఏర్పాటు చేసిన విందుకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, అయూబ్, ధన్వంతి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌కు
మంత్రి సురేఖ.
ప్రజాప్రతినిధులు, పార్టీ
నేతలతో కలిసి భోజనం


