యువత ఆరోగ్యంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆరోగ్యంగా ఉండాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

యువత ఆరోగ్యంగా ఉండాలి

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

వరంగల్‌ స్పోర్ట్స్‌: యువత ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర భవిష్యత్‌ బలంగా ఉంటుందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా యువజన, క్రీడల వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 5కేఎం మారథాన్‌ను నిర్వహించారు. హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం వద్ద స్థానిక ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మారథాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ యువతలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. జేఎన్‌ఎస్‌ వద్ద ప్రారంభమైన మారథాన్‌ అశోకా టాకీస్‌, పబ్లిక్‌ గార్డెన్‌, అంబేడ్కర్‌ సర్కిల్‌, కాళోజీ జంక్షన్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. హనుమకొండ డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌ అధ్యక్షతన జరిగిన మారథాన్‌లో ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, హనుమకొండ ఏసీపీ నరసింహారావు, ట్రాఫిక్‌ ఏసీపీ సత్యనారాయణ, అడిషనల్‌ ఏసీపీ వేముల శ్రీనివాస్‌, క్రీడా సంఘాల ప్రతినిధులు శ్యామల పవన్‌ కుమార్‌, సారంగపాణి, శ్యాంప్రసాద్‌, ఎరగ్రట్టు స్వామి, రమేశ్‌రెడ్డి, సాంబయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకటస్వామి, శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement