నర్సంపేట : ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏలో చేర్చొద్దని నర్సంపేట గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుంటి సంజీవ ప్రభుత్వాన్ని కోరారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ–ఏలోని కులాల ప్రజలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏలో కలిపితే తమ కులానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పునరాలోచించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు ఎర్రబోయిన కిషన్, జీజుల సాగర్, బయ్య నారాయణ, పూస ఏకాంబరం, మేదరబోయిన సత్యనారాయణ, అంకాల సాంబయ్య, మల్లికార్జున్, మైస కుమారస్వామి, మేదరబోయిన శ్రీనివాస్, గుంటి శ్రీనివాస్, సందరి దర్గాస్వామి, కాపరబోయిన రమేశ్, అంకాల సురేశ్, అంబటి రవి, తదితరులు పాల్గొన్నారు.


