మహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి

May 19 2026 1:22 AM | Updated on May 19 2026 1:22 AM

మహేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి

ఎస్టీ యూనియన్‌ ఉపాధ్యక్షుడు సురేందర్‌

రాయపర్తి : మండలంలోని ఏకేతండాలో గిరిజన యువతి మహేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన క్రమంలో కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఎస్టీ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేందర్‌ రాథోడ్‌ కోరారు. ఆయన ఆధ్వర్యంలోని బృందం, బాధిత కుటుంబం జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఆదివారం వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా మండల కేంద్రంలో మీడియాకు సురేందర్‌ వివరాలు వెల్లడించి మాట్లాడారు. మహేశ్వరి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది నెలలు గడుస్తున్నా సమగ్ర చర్యలు చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించి మహేశ్వరి మృతి మిస్టరీని ఛేదించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement